
నీటి కోసం నా రైతన్నల కన్నీటి కోసం
భాష కోసం నా తెలంగాణా యాస కోసం
నా అవ్వ కోసం బుక్కేడ్ అంత బువ్వ కోసం
పరువు కోసం నా బతుకు తెరువు కోసం
ఉద్యోగాలకోసం,నా ఆత్మ గౌరవ బావోద్వేగాల కోసం
ఎండిన పొలాల కోసం,అన్దీ అందని కరెంటు కోసం
మాడిన కడుపు కోసం , మండిన గుండె కోసం
గుల్ఫ్ వలసల కోసం,ఫ్లౌరోసిస్ బాధితుల కోసం
సిరిసిల్ల చేనేత చావుల కోసం,సిరిఘల్ల సింగరేణి గోసల కోసం
బట్ట కోసం కబ్జావుతున్ననా భూమి పట్టా కోసం
ఆలనా కోసం,స్వయం పరిపాలన కోసం
కవుల కోసం,కళాకారుల కోసం,అమరవీరుల కోసం
కనుమరుగవుతున్న నా జాతి సంస్కృతి కోసం..............
మరి దేని కోసం,ఇంకా ఎందుకోసం నీ సమైక్యాంధ్ర మోసం..?
చెయ్యకు తెలుగుతల్లి పేరుతో నా తెలంగాణాను పరిహాసం
No comments:
Post a Comment