సమిక్యవాదం ఒక వాదం
అది ఒక స్వార్థ నినాదం
అది ఒక ఆర్థిక పరమైన వాదం
ఏమిటి సమిక్యవాద భావం
ప్రాంతాల సమైక్యతా
ప్రజల సమైక్యతా
వనరుల సమైక్యతా
వంశాపరంపరం సమైక్యతా
భాషా సమైక్యతా
భావ సమైక్యతా
దేని సమైక్యత కావాలి ?
దోచిన ఆస్తుల రక్షణకే
కావాలికదా సమైక్యత ?
కదా ఇది మీ సమిక్యవాదం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గొళ్ళెం
ఎందుకు మీకీ స్వార్థం
ఎందుకు మీకీ పట్టుదల
ఏమిటి మీ వాదనలో పరమార్థం ?
మానుకోండి మీ వాదన
బలపరచండి మా వాదన
మా రాష్ట్రం లో మమ్ము బతకనివ్వండి
ఇంకా మీ ఆదిపత్యం సహించం
విదిపోవుటే మాకు రక్ష
మా తెలంగాణ మాకు రక్ష
మా తెలంగాణ రాష్ట్రం కావాలి
మా రాష్ట్రం మాకు కావాలి
దిని కోసం నేలా నింగి ఒకటిచేస్తం
చిన్న పెద్ద ఏకమై తెలంగాణ సాధనకి చస్తాం
ఇది యే మా లక్ష్యం
ఇది యే మా వాదన
ఇది యే తథ్యం
ఇది యే సత్యంజై తెలంగాణ జై జై తెలంగాణ
-------------------------------------------------------------------------------------------------
ఒకే దేశంలో
ఒకే సర్కారుకింద
ఒకే జాతిగా
ఏండ్ల కొద్ది నివసించిన
కలసిమెలసి జీవించిన
హిందూ ముస్లిం లో సమైక్యత రాలేదే
చివరకు దేశాన్ని పంచుకొని విడిపోలే
నాల్గుపదుల వత్సరాలు
కల్సిఉన్న మనలోన
సమైక్యత వస్తుందా ?
వచినా అది నిలుస్తుందా ?
ఏనాటికి మీకు మాకు
కుదరదు ఇక పోతు
చెల్లదు మీ సమిక్యవాదపు తతు
తెల్లదొరల తర్ఫీదు మిది
నవాబుల తర్ఫీదు మాది
తమిళ సంస్కృతి మిది
నిజాం సంస్కృతి మాది
మీ భాష తత్సమాలమిలితం
మా భాష ఉర్డుపదాలవిలినం
కలడు తేడా మీకు మాకు ఎంతో
నేర్చుకొన్నాము మేకింద ఎన్తూ
కలవదు ఏనాటికి మీకు మాకు పోతు
విదిపోవుతయే మీకు మాకు ముదు
విదిపోవుతయే మా లక్ష్యం
తెలంగాణ ఏర్పాటే మా లక్ష్యం
ప్రాణాలు విడిచిన సాదించాలి ఈ లక్ష్యం
లేక కాదే వటవృక్షం కింద చిన్నమొక్క బ్రతుకు
జై తెలంగాణ జై జై తెలంగాణ
-రాజ్ గోపాల్ రావు
No comments:
Post a Comment