జయ జయహే తెలంగాణ ...జనని జయకేతనం
ముక్కోటి గొంతుకలు ఒక్కటిన చేతనం
తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
పది జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభాతరం
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ!
పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ
గండరగండడు కొమురం భీముడే నీ బిడ్ద
కాకతీయ కళాప్రభల,కాంతి రేఖ రామప్ప
గోలుకొండ నవాబుల గోప్పవేలుగే చార్మినార్
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ!
జానపద జనజీవన జావళీలు జాలువార
కవిగాయక వైతాళిక కళల మంజీరాలు
జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర
అను నిత్యం నీ గానం..అమ్మ నీవే మా ప్రాణం
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ!
సిరివెలుగులు వేరజిమ్మే సింగరేణి బంగారం
అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం
సహజమైన వన సంపద ,సక్కనైన పువ్వుల పొద
సిరులు పండే సారమున్న మాగాణియే కద నీ యెడ
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ!
గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లాలే
పచ్చని మాగాణుల్లో పసిడి సిరులు పండాలె
సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలె
స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి
జై తెలంగాణ జై జై తెలంగాణ
జై తెలంగాణ జై జై తెలంగాణ!
హట్స్ అఫ్ 2 డా.అందెశ్రీ
No comments:
Post a Comment