title

WISHES ON FORMATION OF SEPARATE STATE OF TELANGANA - dedicated to the MARTYRS

Monday, February 7, 2011

శ్రీ కృష్ణ రిపోర్ట్ ఎట్లా ఇచ్చిన్రంటే… ..


దుగ్గల్: కిష్టన్న, మనం అందరి మాటలిన్దమనంగానే మరి గిన్ని లక్షల కోట్ల మంది ఉత్తరాలు పంపిన్రు, ఎం జేద్దమే?
కృష్ణ: దుగ్గి గా, ఏముంది ర భై, లాటరీ తీద్దాం ఒక పది ఉత్తరాలు.
దుగ్గల్: లాటరీ దీయల్నంటే కూడా అన్ని ఎరాలే గదనే? నేనో మాట జెప్తింటావా?
కృష్ణ: సెప్పర భై
దుగ్గల్: ఏముందే? మంకు మంచిగా విందులు, గిందులు ఇచ్చింరు కదా…వాళ్ళు చెప్పిందే గీకుదాం.
కృష్ణ: అంటె మన లగ్గు (లగడపాటి) , వెంకి (ట్.జి. వెంకటేష్) చెప్పినట్ట?
దుగ్గల్: ఆ గంతే! లగ్గు గాడు చెప్పినట్టు ‘సమిక్యంధ్ర’ , వెంకి గాడు చెప్పినట్టు రాయల-తెలంగాణ ఎని గీక్తైపాయే.
కృష్ణ: అరె వారి. మరి తెలంగానోల్లు లొల్లి చేస్తారు గదరా? మానని ఉర్కిచ్క తంతారు. వాళ్ళది ఒకటి గీకు.
దుగ్గల్: అమ్మ! వాళ్ళది గీకుతేమైన ఉంటద?
కృష్ణ: సరే వాళ్ళది గీక్తే గీకుదాం కాని దాని తోటి ఇంకో రెండు గీకుదాం : హైదరాబాద్ మాత్రం తెలంగాణ కు దక్కకుండా ఇంకో రెండు గీకు ర భై.
దుగ్గల్: మస్తు జెప్పినావ్ అన్న! జై శ్రీ కృష్ణ ! జై లగడపాటి! జై వెంకటేష్! జై చంద్రబాబు!
కృష్ణ: అరె మెల్లగను బె! జై తెలంగాణ అనకుంటే మనం హైదరాబాద్ ల గాని తెలంగాణ ల గాని తిర్గాలెం ర.

No comments:

Post a Comment