వరంగల్, జూలై 14 : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయభాస్కర్‌కు ఓ మహిళా ఓటరు ఓటేస్తానని వాగ్దానమే కాదు రూ.10వేల విరాళం ఇచ్చి ఆశ్చర్యపరిచారు. బుధవారం హన్మకొండలోని ఇందిరానగర్‌లో ప్రచారం నిర్వహిస్తోన్న వినయభాస్కర్‌కు సిరమల్లే కవిత అనే మహిళా ఓటరు తిలకం దిద్ది, రూ.10వేలను విరాళంగా అందజేశారు. మహిళలు బోనాలతో ప్రచారం నిర్వహించారు. నాలుగు రోడ్ల కూడలి వద్ద వినయ్‌భాస్కర్‌కు ఓటేస్తామని ప్రతిజ్ఞ కూడా చేశారు.
మమ్మల్ని విసిగించకండి... ఓ ఇంటి యజమాని ఉత్తరభావం
ఎన్నికల ప్రచారంలో నాయకుల ఎత్తులకు ఓటర్లు పై ఎత్తులు వేస్తోన్నారు. బుధవారం 48, 49 డివిజన్లలో పలు కాలనీల్లో ఇళ్ల యజమానులు ఓట్లు అడిగే నేతలకు 'గమనిక'ల రూపంలో తమ మనసులోని భావాల్ని ఇళ్ల ముందు అతికించారు.
"గమనిక..! దయచేసి మమ్మ ల్ని విసిగించకండి. మా ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం జరిగిపోయింది. తెలంగాణ కోసం రాజీనామా చేసిన అభ్యర్థికే మా ఇంటి ఓట్లు. ఇట్లు, ఇంటి యజమాని''
అని స్టిక్కర్‌ను అతికించడం గమనార్హం.
తెలంగాణాని దోచేది కాంగ్రెస్,
ReplyDeleteతెలంగాణాని ముంచేది కాంగ్రెస్,
తెలంగాణా ద్రోహి ఈ కాంగ్రెస్.
తలకాయైనా తీసిస్తాం తెలంగాణా సాధిస్తాం
ReplyDelete