Monday, February 7, 2011

యేమున్నది తెలంగాణమున గర్వకారణము.....

యేమున్నది తెలంగాణమున గర్వకారణము..
యే పేజి తిరగేసిన రక్తసిక్తం..
యే పుట తిప్పిన ద్రోహుల రక్త దాహం..
యే పుస్తకము తెరచిన కలిసిరాని కాలపు నెత్తుటి మరకలు
యే చరిత్ర చదివిన బలిదానాల శవప్రహసనం..
యే కలముని కదిలించిన శిథిల సమాజపు ప్రవాహం…
యే మనిషిని కదిలించిన మండిన గుండెల అవక్షేపం..
యే తరముని ప్రష్నించిన తీరని ఆకలి పోరాటం..
యే గుండెని తడిమి చూసిన వ్యధ శిలగ మారిన ఆఖరి ఆరాటం..
దాగిన దేవుడు ఎంతకు మారడు..
ఆశతీరు మార్గము ఎంతకు దొరకదు..
కలములన్ని కొలుములయినా
కలికాలం కలిసొచ్చినా
యేమున్నది తెలంగాణమున గర్వకారణము

No comments:

Post a Comment